ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సల్ఫొనై ల్ యూరియాలు ( Sufonylureas ) :

ఈ ఔషధములు క్లోమములో బీటా కణముల నుంచి ఇన్సులిన్ స్రావకమును ప్రేరేపిస్తాయి. ఆహారము తీసుకొనుటకు 30 - 60 నిమిషముల ముందు వీటిని తీసుకోవాలి. ఉపవాస స్థితులలో వీటిని తీసుకోకూడదు. ఈ మందులను సేవించి ఆహారము తినకపోతే రక్తపు చక్కెర విలువలు పడిపోగలవు. గ్లైబు రైడు (Glyburide), గ్లైపి జైడ్ (Glipizide) లను దీర్ఘ కా ల మూత్రాంగవ్యాధి ఉన్నవారిలో వాడకూడదు. వృద్ధులలో వీటిని వాడునపుడు జాగ్రత్త అవసరము. గ్లైమిపిరైడ్ (Glimipiride), గ్లిక్లజైడ్ (Gliclazide) లను మూత్రాంగవైఫల్యము ఉన్నవారిలోను, వృద్ధుల లోను జాగ్రత్తతో వాడాలి. మెగ్లి టినై డులు ( Maglitinides ) :

మెగ్లిటినైడులు క్లోమములో ఇన్సులిన్ స్రావకమును ప్రేరేపిస్తాయి, చక్కెర విలువలను తగ్గిస్తాయి. ఇవి సల్ఫొనైల్ యూరియాలకంటె త్వరితముగా పనిచేసి, త్వరితముగా క్షీణిస్తాయి. ఈ మందులు సేవించిన వెంటనే ఆహారము తీసుకోవాలి. ఉపవాస సమయములలో వీటిని తీసుకోకూడదు. నెటిగ్లినైడ్ (Nateglinide), రెపగ్నై లి డ్ (Repaglinide), మిటిగ్నై లి డ్ (Mitiglinide) ఈ తరగతిలో ఔషధములు. రెపగ్లినైడ్ ను మూత్రవైఫల్యము (renal failure) కలవారు వాడకూడదు. థయాజోలిడిన్ డయోన్స్ (Thiazolidinediones) :

పయోగ్లిటజోన్ (Pioglitazone) ఈ తరగతి ఔషధము. ఇది కాలేయముపైన, కండరములపైన, దేహములో కొవ్వుపైన ఇన్సులిన్ ప్రభావమును ఇనుమడింపజేసి రక్తములో చక్కెర విలువలను తగ్గిస్తుంది.

దీనిని హృదయ వైఫల్యము కలవారిలోను, కాళ్ళపొంగులు, హృద్ధమని వ్యాధులు, హృదయపు ఎడమ జఠరిక ప్రమాణము పెరిగినవారిలోను, మూత్రాంగ వైఫల్యము కలవారిలోను వాడకుండుట మేలు. దీనిని వాడుటకు ముందు, వాడుతున్నపుడు కాలేయ జీవోత్ప్రేరకములను (liver enzymes) పరిశీలిస్తూ ఉండాలి.

34 ::