ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధికముగా (మూడులీటరులకు మించి) సేవించి, లవణనష్టములను పూరించకపోతే రక్తములో సోడియమ్ ప్రమాణములు తగ్గవచ్చును (hyponatremia). అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు కలచోట్ల పనిచేసే వైద్య బృందములకు ఉష్ణ సంబంధ వ్యాధులను కనిపెట్టుటలోను, నిరూపిత చికిత్సా పద్ధతులలోను (evidence based medical standards) తగు శిక్షణ ఇయ్యాలి. వేసవి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు, వడగాడ్పులు వీచుతున్నపుడు వృద్ధులకు, గృహ విహీనులకు ప్రభుత్వములు సమాజములు శీతల వసతి గృహములను తాత్కాలికముగానైనా ఏర్పాటు చెయ్యాలి.

323 ::