ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినాళ రసమును ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్, గ్లూ క గాన్ లు ఒకదానికి ఇంకొకటి వ్యతిరేకముగా పనిచేస్తాయి.

రక్తములో ఆహారము తిన్న తరువాత, చక్కెర విలువలు పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్త ము లో ఇన్సులిన్ విలువ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ చక్కెరను కణాలలోనికి పంపుతుంది. కాలేయము, కండరాలలో అదనపు చక్కెరను మధుజనిగా (Glycogen) మారుస్తుంది. క్రొవ్వుకణాల లోనికి చక్కెరను చేర్చి క్రొవ్వుగా మారుస్తుంది. కణములలో చక్కెర వినియోగ పడి శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ దోహదకారి. ఇన్సులిన్ వలన చక్కెర విలువలు అదుపులోకి వస్తాయి.

రక్త ము లో చక్కెర విలువలు బాగా పడిపోతే గ్లూ క గాన్ స్రావము పెరుగుతుంది. గ్లూకగాన్ కాలేయము, కండరములలో మధుజని విచ్ఛిన్నమును (Glycogenolysis), క్రొవ్వుపొరలలో మద విచ్ఛిన్నమును (Lypolysis) ప్రేరేపించి చక్కెర ఉత్పత్తిని పెంచుతుంది. అందుచే రక్త ము లో చక్కెర విలువలు పెరుగుతాయి.. ఎడ్రినలిన్, ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడ్ ల వంటి హార్మోనుల ప్రభావము కూడా చక్కెర విలువలపై ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినా, ఇన్సులిన్ కు అవరోధము ఎక్కువయి (Insulin Resistance), ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతముగా పని చేయలేక పోయినా, చక్కెరపై అదుపు తగ్గుతుంది. చక్కెర కాలేయము, కండరాలలో మధుజనిగా మారదు. క్రొవ్వుపొరలలో క్రొవ్వుగా మార్పు చెందదు. కణజాలము లోనికి తగినంతగా ప్రవేశించదు. చక్కెర ప్రాణ వాయువుతో కలిసి బొగ్గుపులుసు వాయువు, ఉదకములుగా విచ్ఛిత్తి జరిగి, శక్తి విడుదల అగుటకు కూడా ఇన్సులిన్ అవసరమే.

 ఇన్సులిన్ లోపము, అసమర్థతల వలన రక్తములో  చక్కెర విలువలు

పెరిగి మధుమేహవ్యాధి కలుగ జేస్తాయి. మధుమేహవ్యాధి రకములు : 1. మొదటి రకపు మధుమేహవ్యాధి (Type 1 Diabetes mellitus) :

మొదటి రకపు మధుమేహము (Type-1 or Insulin Dependent)

28 ::