ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చర్యలు ధమనీకాఠిన్యతను మందగించుతాయి. ఆహారములో ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, అపరాలు, ఆలివ్ నూనె వాడుట మంచిది. మాంసాహారము తినేవారు చేపల వాడుక పెంచుకొని మిగిలిన మాంసములను మితపరచుకొనుట మేలు. మద్య వినియోగమును మితములో ఉంచుకోవాలి. కర్ణికా ప్రకంపనము (atrial fibrillation) గలవారు, కృత్రిమ హృదయకవాటములు ఉన్న వారు రక్తపుగడ్డలు నివారించు మందులు (anticoagulants) వాడుకోవాలి.

269 ::