ఈ పుట అచ్చుదిద్దబడ్డది

sepsis) వారిలో జ్వరము, నీరసము, సూక్ష్మజీవులబారికి గుఱి అయిన అవయవములలో కలిగే లక్షణములు కనిపిస్తాయి.

Systematic lupus erythematosis (SLE) వంటి స్వయంప్రహరణ వ్యాధులు (auto immune diseases) కలవారిలో కీళ్ళ నొప్పులు, చర్మములో పొక్కులు, విస్ఫోటముల (rashes)  వంటి లక్షణములు కనిపిస్తాయి. మూత్రప్రవాహమునకు అవరోధములు ఉన్నవారిలో మూత్రవిసరన ్జ లో యిబ్బంది, నొప్పి, పొత్తికడుపులో నొప్పి, కడుపు పక్కలందు నొప్పి, మూత్రము విసర్జించునపుడు మంట, నొప్పి, మూత్రములో రక్తము (hematuria) వంటి లక్షణములు ఉండవచ్చు.

ప్రాష్టేటుగ్రంథి పెరుగుదలలను, మూత్రాశయపు నిండుతనమును (urinary bladder distension), పొత్తికడుపులో పెరుగుదలలను వైద్యులు రోగులను పరీక్షించునపుడు గమనించగలరు. మూత్ర ప్రవాహమునకు అవరోధము కలుగుటచే మూత్రాశయము (urinary bladder) పొంగి ఉంటే మూత్రాశయములోనికి కృత్రిమనాళము (catheter) రోగజనక రహితముగా  (sterile technique) చొప్పించి మూత్రప్రవాహమునకు సదుపాయము కల్పిస్తే మూత్రాంగ విఘాతమునకు కారణము తెలియుటే కాక చికిత్స కూడా సాధించగలము. పరీక్షలు :మూత్ర పరీక్ష :

మూత్రాంగపూర్వ (prerenal) కారణములచే మూత్రాంగ విఘాతములు కలిగిన వారిలో మూత్రపరీక్షలో  తేడా కనిపించదు. మూత్రనాళికల కణవిధ్వంసము (acute tubular necrosis) గల వారిలో మూత్రమును సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించినపుడు మట్టిరంగు కణికలు గల మూసలు  (muddy granular casts) కనిపిస్తాయి. ఎఱ్ఱరక్తకణముల మూసలు (erythrocyte casts), మూత్రములో

237 ::