ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పీఠిక


తే. బ్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
     గాశికాఖండ మనుమహాగ్రంథమేను
     దెనుఁగు జేసెద గర్ణాటదేశకటక
     పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని."


అను పద్యమునందు "కర్ణాటదేశకటక పద్మవనహేళి" (కర్ణాట దేశపట్టణము లను కమలములకు సూర్యుఁడు) అను విశేషణమును శ్రీనాథుఁడు దనకుఁ గూర్చుకొనియున్నందునను,

భీమేశ్వరఖండములో -


గీ. "ప్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు
    పలుకునుడికారమున నాంధ్రభాష యందు
    రెవ్వరేమన్న నండ్రు నా కేమి కొఱఁత
    నాకవిత్వంబు నిజము కర్ణాటభాష."


అను పద్యములో "నాకవిత్వంబు నిజము కర్ణాటభాష" యని తనకుఁ గర్ణాటభాషయందుఁ గల ప్రేమను సూచించి యున్నందునను,

ఆ భీమఖండములోనే -


మ. "కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరున్
     ఘనునిం బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
     వినమజ్జ్యాంతరసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు నా
     యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్యచూడామణిన్."


అను పద్యమునందు శ్రీనాథుని పితామహుఁడును బద్మపురాణ గ్రంథ నిర్మాణాలంకర్మీణుఁడును కవితావిద్యాధురంధరుండును నగు కమలనాభామాత్యగ్రామణి పశ్చిమసముద్రతీరమునఁ