ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

5

దెలుఁగు లెస్స" యను పండితవచనానుసరణిగ నుత్తమభాష నాఁబడు నాంధ్రభాషయందుఁగూడ ననేకులు నన్నయభట్ట తిక్కనాది మాహాకవిసార్వభౌములు కావ్యరత్నంబుల లోకంబున వెలయించి యభిరూపశిఖామణుల హృదయంబుల నలరించి కీర్తిశేషులై నెలకొనియున్నారు. కాఁబట్టి యిట్టి యాంధ్ర భాషాకవుల దివ్యచారిత్రసుధారసమును గ్రోలి యానందానుభవముసేయుట యవశ్యకర్తవ్యమయినందునఁ, బ్రకృత మీ హరవిలాస ప్రబంధనిర్మాత యగు శ్రీనాథుని చారిత్రామృత మించుక చవిచూతము.

శ్రీనాథుఁడు

అనవద్యహృద్యకావ్యకల్పనాధురీణుం డగు మహాకవి సార్వభౌముఁడు. ఈ మహాకవి జన్మస్థానమును గుఱించి

కాశీఖండములో-


సీ. "చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు
             రచియించితి మరుత్తరాట్చరిత్ర
     నూనూఁగుమీసాలనూత్నయౌవనమున
             శాలివాహనసప్తశతి నొడివితి
     సంతరించితి నిండుజవ్వనంబునయందు
             హర్షనైషధకావ్యమాంధ్రభాషఁ
     బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొని
             యాడితి భీమనాయకునిమహిమఁ