ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

హైందవ స్వరాజ్యము

కెరుకయైనది. అతడు పారిపోయినాడు. కాని అతని మనస్సున కూడ ఉద్రేకము కల్గినది. తన సోదర చోరబృందమును చేర్చినాడు. పట్టపగటివేళ మిము దోచుకొందునని అట్టహాసముగ సందేశము పంపినాడు. మీరు బలవంతులు. మీకు భయము లేదు. అతని నెదుర్కొనుసాహసము కలదు. ఈలోపుగ నా దొంగ మీ పరిసరవర్తుల పీడించును. వారు మీకడ మొఱ పెట్టుదురు ? మీ రేమందురు. అయ్యలారా అంతయు మీకొరకే చేయుచున్నాను. అతడు నాద్రవ్యము నపహరించినాడని నాకాగ్రహములేదు. అని ప్రత్యుత్తరమిత్తురు. మీ పరిసరవక్తు లందురుగదా 'వీడెప్పుడు మమ్ము హింసింపడు, మీరు వీనితో పోరాటము పెట్టికొనిన పిదపనే యీగతి తటస్థించినది.' ముందుకుపోయిన గోయి వెనుకకు తరలిన చెరువు అయినది. మీ పరిసరవర్తులగు బీదలయెడ మీ కెక్కు.వకరుణ. వారు చెప్పునది నిజము. మీకు తెలుసును. మీరేమి చేయవలెను ? దొంగను వదలితిరా మీకు నవమానము. కాబట్టి బీదల మీ రేమందురు ? "అయ్యలారా రండు. నాద్రవ్యముమీది. నేను మీకు ఆయుధముల నిచ్చెద. ఆదొంగను మీరు పట్టి తన్నుడు వదలవలదు ఈరీతిగా పోరాటము పెరుగును. దొంగలు సంఖ్యాతీతులగుదురు. మీపరిసరజనము అననసరముగా అనాను కూలముల బడుదురు. ఈకారణముచేత దొంగమీద కసిదీర్చు