ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

హైందవ స్వరాజ్యము

తరువాత ఇటలీవారికేమి యంతగొప్పలాభము కలిగినది. ఏమియు లేదు. వట్టినామకార్థము లాభముమాత్రము సమకూరినది. ఏసంస్కారములకొరకు యుద్ధము జరిగెనో ఆసంస్కారము లింకను ఇటలీలో అంగీకృతముకాలేదు. ప్రజల సాధారణస్థితి నాడెట్టు లుండెనో నేడును అట్టులేయున్నది. అట్టిస్థితి ఇక్కడ కలుగజేయవలెననిమీకు నిస్టముకాదుకదా ! భారతభూమిలోని కోట్లకొలది ప్రజలు సుఖమందవలయునేకాని మీచేతికి రాజ్యభారము దొరకిన చాలునని మీరాలోచింపరు కదా! నిజ మిదియే యగునేని మన మొక్క విషయ మాలోచించవలెను. కోట్లప్రజలకు స్వరాజ్య మబ్బు మెట్లు. అనేక సంస్థానాధీశ్వరులు పాలనలో నుండుప్రజలు మిక్కిలి బాధలుపడుచున్నా రని మీరంగీకరింపవలసి యుందురు. కరుణ కొంచెముకూడ చూపక ఆయధిపతులు, ప్రజలకు కష్టములు కలిగించుచుందురు. వారి నిరంకుశత్వము బ్రిటిషువారినిరంకుశత్వమునకంటె ప్రబలతరము ఆనిరంకుశత్వము మీరు కావలయునందు రేని మనమెప్పుడును అభిప్రాయములలో నేకీభవింపజాలము. ఇంగ్లీషువారు వెడలి పోయిన స్వదేశసంస్థానాధీశ్వరులకాలిక్రిందపడి ప్రజ నలిగిపోవచ్చును అను ఏర్పాటునకు నే నెప్పుడును సమ్మతింపజాలను. అది నాదేశభక్తి కాజాలదు. దేశాభిమానమునకు నామతమున సర్థము దేశప్రజలక్షేమము, సౌఖ్యము. - ఇంగ్లీషువారిమూలక