ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82

హైదవ స్వరాజ్యము'.


గలవారు తమకు తామే వెడలి పోదురు. ఇట్టిది మసయనుభవ ములో జరుగుచునే యున్నది.


చమవరి: చరిత్రలో ఇట్టి దెక్కడను జగ లేదు.


సంపా: చరిత్రలో జరగనిది జరగనే జరగదనుట మాన వుని గౌరమును సంశయించుటయగును. మనకు సకారణమని తోచుదానిని ప్రయత్నించుట మసధర్మము, అన్ని దేశముల పరి స్థితులును ఒక్కటేకాదు. భారత భూమిస్థితి చిత్రముగా ప్రత్యే ము. దాని శక్తి అనంతము, కాబట్టి యితర దేశచరిత్రలతో ఈ భూమిని పోల్చనక్కర లేదు. ఇత నాగరకములు నశించినవి కాని భారత నాగరకము కాలుదున్ని నిలచిదను సంసంగతి యిది వరలో నె చెప్పియున్నాను.


చదువరి: ఇవి నాకర్థముకాలేదు. ముష్టిబ లముచేత ఇంగ్లీ ష్హువారిని పెడలగొట్టవలెనుట నిర్వివాదాంశముగా నున్నది. వారు 'దేశములో నున్నంత కాలము మనకు శాంతికలుగదు. మన కవీశ్వరులలో నొక్కడు దాసులు స్వాతంత్ర్యములను గురించి కలనైనకనరాదనుచున్నాడు. ఇంగ్లీషు వారిచ్చట నుం డుటచేత మనము దినదిసము బలహీనుల మగుచున్నాము. మన ప్రతిభ యంతయు పోయినది. మన ప్రజను చూచిన భయాక్రాం తుల వలె కన్పించుచున్నాడు. ఇంగ్లీషువారు దేశములో మహా కష్టమువలె నున్నారు. ఈ మహారీష్టమను అన్ని యుపాయముల ను తొలగింపపలెను,