ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72

హైండవ స్వరాజ్యము.


సములని యాడవచ్చును. ఇచ్చవచ్చిన యనుభవములలో నోలలాడవచ్చను. అయిన ఇందులో నిజమే మియందురా ! డాక్టరులు మనకీయనుభవములను పట్టించుచున్నారు. మనము అత్మనిగ్రహము లేని వారమయినాము. పౌరుష విహీనత్వము మనపాలైనది. ఈ కారణములచేత దేశ సేవచేయుటకు మనమన ర్హులము. యూరోపియను నైద్యము నేర్చుకొనుట మన బాని సత్వము దృఢతరము చేసికొనుటయే.


వైద్యవృత్తియేల అవలంబించుచున్నామో ఆలోచించుట ఆవసరము. లోకమును సేవించన లెనని మాత్రము కాదు. గౌరనము ఐశ్వర్యము పంపాదించుట కే మనము డాక్టరులగు చున్నాము. అవృత్తిలో నిజమైన లోక సేవ యేమాత్రములే దనియు దానివలన లోకమునకు అపకారమనియు చూపుటకు నే నిదివరకు ప్రయత్నము చేసితిని. డాక్టరులు తమకు గొప్ప జ్ఞానము కలయటు నటించి పెద్ద పెద్ద మొత్తములు లాగుదురు. రెండుదమ్మిడీలు చేయనిమందును వారు రూపాయలురూపొ యలు పెట్టి యమ్ముదురు, పిచ్చినమ్మకముచేత తమకు కల రోగము కుదురునను భ్రమచేత ప్రజ ఈమందులను కొందురు. ఇదంతయు చూడగా ప్రజాహితము నెంతయో నెత్తిన వేసికొను నట్లు నటించు డాక్టగుల కంటె, మనయెరుకలో నుండునట్టి నాటు వైద్యులే మేలుగారా ?