ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70

హైందవ స్వరాజ్యము.


మన పై అధికారము నిలుపుకొనుటకు ఇంగ్లీషునారు వైద్య వృత్తిని బహుచక్కగా వినియోగించినారు. రాజ కీయలాభమును సంపాదించుటకు ప్రాచ్యఖండ వాసులగు సంస్థానాధీశ్వరులపట్ల ఇంగ్లీషు వైద్యులు తమ వృత్తిని వినియోగించినట్లు నిదర్శనము లున్నవి.


వైద్యులు మనబునాథులనే చెరపినారు. ఏమి రాని నాటు వైద్యులే సున్నితులైన నేటి వేద్య శిఖామణులకంటే మెరుగని నాకొకొకప్పుడు తోచుచున్నది. ఆలోచించి చూతము. దేహ మును కాపాడు ట వైద్యునివృత్తి. సరిగనాలోచించిన నదియును గాదు. దేహమును బాధించు రుజలను పోనాడుట వారినిధి. ఈ రోగము 'లెట్ల కలుగుచున్నవి? నిజముగా మనయ జాగ్రత్తవలన, మన విషయలోలత్వమువలన. నేనూరక తిన్నాను. అజీర్తికలిగి నది. వైద్యుని కడకు పోయినాను. అతడుమందిచ్చినాడు. నాకు బాగైనది. మరల ఇష్టముకొలది మెక్కినాను. మరల అజీర్తి య యినది. 'మరల వైద్యుని చేతిమాత్రలు మ్రింగ వలసిన దే. మొదట మాత్రలు మ్రింగనిచో నాకుతగిన శాస్తియగును. మరల మితి మీరి తినను. అంతటితో అజీర్తి నిలిచి పోవును. వైద్యు డడ్డు తగిలి నావిషయలోలత్వమును ప్రోత్సాహపరచినాడు. అందు వలన దేహమేమో బాగుపడినది కాని నామానసముమాత్ర ము, శక్తివిహీనమైనది. మందులూరక త్రాగుచుండిన మాన సము మంటగలియ వలసిన దే,