ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

భారతభూమిస్థితి.

చించుట పొరబాటు. తమయధికారమును నిలవబెట్టి కొన నాలోచించువారు న్యాయస్థానముల మూలకముగా ఆపనిని నిర్వహింప జూచుచున్నారు. ప్రజలు తమ లోని కలహములను తీర్చు కొనగలుగు నెడల మూడవవానికి అధికార మే దొరకదు.యుద్ధ ములు చేయుట చేతనో బంధువుల మూలకముగనో కలహములు తీర్చుకొనునప్పుడు మానవుడు మానవత్వము లేనివాడయ్యెను. న్యాయస్థానములకు పోవునప్పటికీ అంతకంటెను పౌరుషనిహీను డైనాడు. ద్వంద్వ యుద్ధమున వివాదముతీర్చుకొనుట అనాగరక మనుట నిస్సంశయము. నాకును మీకును కలవివాదమును తీర్చు. టకుమూడవ వానిని నియమింతునేని అదియంతకంటెను తక్కువ యనాగరకమగునా? మూడవవాని తీర్మానము ఎల్లప్పుడును సరి కాజాలదు. వివాదపడిన వారికే తెలియును తమలో ఎవ్వ రిది న్యాయమో, ఎవ్వరిది కాదో, అట్లుండగా మనము మన యమాయకత్వము చేతను, అజ్ఞానము చేతను మనద్రవ్యము తీసి కొనిన మూడవవాడు మనకు న్యాయము కలుగ చేయునని భ్రమపడుచున్నాము.


ముఖ్యముగా జ్ఞాపక ముంచుకొనదగిన దిది.న్యాయవాదులు లేక న్యాయస్థానములు స్థాపితములై యుండవు. న్యాయస్థా నములు లేక ఇంగ్లీషు పరిపాలన అసాధ్యమైయుండును. ఇంగీషు న్యాయాధికారులు, ఇంగ్లీషు న్యాయవాదులు, ఇంగ్లీషు పోలీసు