ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56

హైండప స్వరాజ్యము.

మహమ్మదీయులలో విగ్రహవిచ్ఛేదకు లెట్లుకలరో హిందువు లలోకూడ నట్టివారుకలరు. మనము విజ్ఞానాభివృద్ధి నందిన ట్లెల్ల మతేతరులతో పోరాడ నవసరము లేదనుట దృఢతరముగా నర్థము కాగలదు.


చదువరి: గోరక్షను గురించి మూయభిప్రాయము వీనవలతును.


సంపా: నాకు గోవు నెడ గౌరవముకలదు. ప్రేమపూర్వక మగు పవిత్ర భావమున్నది. భారత భూమి వ్యవసాయక దేశము. గోసంతతి మీద నాధారపడినది. కావున గోవు హైందవ భూమికి శరణ్యము. గోవు ఇంకను వేయివిధముల నుపయోగకారి. మహ మ్మదీయ సోదరు లిది కాదనరు.

కాని నేను గోవును గారవించునట్లే సోదరప్రజనుకూడ గౌరవింతును. మానవుడు హిందువు కాని మహమ్మదీయుడు కాని గోవువలెనే యుపయోగకారి. ఇట్లుండ గోవు నురక్షించు టకుగా నేను మహమ్మదీయునితో పోరాడుట కానిఆతనిని సంహ రించుట కాని తగునా ! అట్లు చేయుదు నేని నేను మహమ్మదీయ సోదరునకును గోవునకును రెంటికిని శత్రువునగుదును. కాబట్టి గోరక్షణకు ఒక్క టేమార్గము, మహమ్మదీయ సోదరుని దరిసి దేశ క్షేమమునకు నాతోకలిసి గోవును సంరక్షింపవలసినదని అతనిని వేడికొందును. అతడంగీకరింపడేని కార్యము నాకు