ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44

హైందవ స్వరాజ్యము.


నాగరకమున కంటే మూఢభక్తితో కూడిన మతనిశ్వాసమే వేయిమడుంగులు శ్రేయస్కరమని మనకు నర్థము కాగలదు. ఇట్లనుట చేత నేను మూఢవిశ్వాసముల విజృంభణమునకు తోడ్ప డుచున్నానని యనుకొనవలదు. వానిని మనము సర్వవిధముల నెదిర్చి తుదముట్టింపవలసిన దే. మతము నే ఉల్లంఘించి ఆపని చేయగలుగుదురనుట కల్ల. మతములోని సారమును గ్రహించి "దానిని నిలిపిన నే తక్కుంగల కార్యము సాధ్యమగును.


చదువరి . అయిన బ్రిటిషు శాంతి నిరుపయోగకరనునియా తమ యభిప్రాయము.


సంపా: శాంతి మీకు కానవచ్చుచున్న దేమో, నాకుమా త్రము కాన రాలేదు.


చదువరి: థగ్గులు, పిండారీలు, ఖలులు దేశమునకు కలిగిం చు చుండిన యుపద్రవము మీకు లక్ష్యములో నున్నట్లు లేదు.


సంపా: కొంచెము మీరాలోచించు నెడల అభయమం తయు నెంతో యెక్కువలోనిది కాదని మీ రెరుంగగలరు. నిజ ముగా ఆ అల్లరులంత గొప్ప వేయైనచో బ్రిటిషువారు రాకముందే ప్రజలందరు నశించి యుందురు.అంతే కాక ప్రస్తుతముండు శాంతి నామకార్థ మే. దీనివలన మనము దైన్య స్థిర్యవిహీనులమై నాము. వ్యర్థులమైనాము. బ్రిటిషువారు పిండారీల భీలుల స్వభా వమును మార్చినారను కొనుటకు రాదు. పిండారీల భయము