ఈ పుట అచ్చుదిద్దబడ్డది
38

హైందవ స్వరాజ్యము.


కొంటిమి. అప్పుడు మనము చేసినపనికి ఇంగ్లీషు వారిని దూషిం చుట వ్యర్థముకాదా? హిందువులు ముహమ్మదీయులు ఒకరి మీదికొకరు కత్తిదూసి యుండిరి. ఇదియు కుంపిణీ వారికి అను కూలమయ్యెను. ఈరీతిగా కుంపిణీకి భారతభూమిలో అధికారము దొరకు గలసందర్భములను మన మేర్పరచితిమి.. అందువలన భారతభూమి నష్టమైనదనుటకంటే మనము భారతభూమిని ఇంగ్లీషువారికి ఇచ్చినామనుట సమంజసము.


చదువరి: వారు భారతభూమిని నిలుపుకొనగలిగన ట్లో చెప్పగలరా?


సంపా: ఏకారణములు వారికి భారతభూమిని దానము చేసెనో ఆకారణములే వారు దానిని నిలుపుకొనుటకును తోడ్పడుచున్నవి. కొందరు ఇంగ్లీషువారు కత్తిబట్టి భారతభూ మిని జయించినట్లును ఆకత్తిబలముచేతనే ఇప్పుడు నిలుపు కొనుచున్నట్లును చెప్పుదురు. ఈ రెండుమాటలును తప్పే, భారత భూమిని నిలుపుకొనుటకు కత్తి మాత్రమును పనికి రాదు. మనమే ఇంగ్లీషువారిని నిలుపు వారము. ఇంగ్లీషువారు దుకాణదారుల జాతీయని 'నెపోలియను వర్ణించినాడట. అది ఉచిత వర్ణనయే. వారికిగల సామ్రాజ్యమంతయు వారు వ్యాపారము కొరకే నిలు పుకొనుచున్నారు. వారి నౌకా సైన్యము భూ సైన్యము అంతయు ఆవ్యాపారమును రక్షించుట కేర్పడినవియే. ట్రాన్సువాలులో