ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నున్నతం బై మించునొకరథం బెక్కి
చతురంగబలము లసంఖ్యలు గొలువ
మితి లేనివాద్యముల్ మి న్నంది మ్రోయ
మానితమాగధమధురగానములు
వీనుల కింపుగా విలసిల్లి పొలయఁ2990
దలకొని వందిబృందములు నుతింపఁ
జెలఁగి పుణ్యాంగనల్ సేసలు చల్ల
వెన్నెల వెదచల్లువింజామరములఁ
బన్నుగా డగ్గఱి భామలు వీవ
వాలారుఁగన్నులవారకామినులు
లీల మైఁ బసిఁడిపళ్లెరములలోన
గమనీయమణిదీపకళికలు మెఱయ
నమరించి మెయిదీఁగె లల్లన సొలయ
ఘనకుచంబులు నిక్కఁ గరములరుచులు
గనుపట్ట దరహాసకాంతులు నిగుడ3000
గలికిచూపుల మించుగములు రాణింప
నిలిచి నివాళింప నిండారువేడ్కఁ
బురముఁ బ్రవేశించి భూప్రజ లెల్ల
బరువడి జయ పెట్టఁ బార్థివేశ్వరుఁడు
వసుమతి నిజరాజ్యవైభవలీల
యెసగంగఁ జిరకాల మేలుచు నుండె
ననుచు మార్కండేయుఁ డాధర్మజునకుఁ

.......................................................................................................

కొండ, మణి దీపకళిక లు= మొగ్గ లవంటి రత్న దీపములు, దరహాసకాంతులు = . రునవ్వు మెఱుఁగులు, మించుగములు= మెజపుల సమూహములు, భ్రమరా