ఈ పుట అచ్చుదిద్దబడ్డది
320

హరిశ్చంద్రోపాఖ్యానము

యూహించి కనుఁగొని యుడుగు గోపంబు'
ననుచు వసిష్ఠుని నజుఁడు ప్రార్థించి
మునుకొని వారి నిమ్ములఁ గౌఁగిలించి
కొనఁ జేసి శాంతిఁ గైకొలిపి వీడ్కొల్పి
చనియె వేల్పులుఁ దాను జలజసంభవుఁడు)
యంత నా వృత్తాంత మానారదుండు
వింతగాఁ జెప్పిన విని సత్యకీర్తి
యానందరసభరితాతుం డై యపుడు
భూనాయకుని రాక పురిఁ జాటఁ బనిచె.......................29 30
నావార్త వీనుల కమృత మై సోఁక
వావిరిఁ దమతమవాడవాడలను
బురిగొన్న సంభ్రమంబునఁ బౌరసతులు
పరువడి బహువిధభవనమాలికలఁ
దనరుముంగిళుల ముందరిహజారములఁ
గనుపట్టునగరుపంకంబునఁ బూసి
సిరిగందమున నోలిఁజిగు రొప్పుఁ జల్లి
సురుచిరకర్పూర సూత్రముల్ నిగుడఁ
బలుచని చాఁదునఁ బట్టెలు దీర్చి
ధళధళ మెఱయుచిత్త రువు వాయించి ........................2940
కరమొప్పఁ గమనిక స్తూరి నలికి
సరస మౌపన్నీట జలకముల్ సల్లి
యాలయంబుల నెల్ల నాణిముత్తెముల

............................................................................................................

నసంబరముతో, పౌరసతులు=పుర స్త్రీలు, భవనమాలికలు= ఇండ్లవరుసలు, సిరి గంధము- శ్రీగంధము, రంగవల్లికలు=మ్రుగ్గులు, తావుమంజిష్ఠ పుట్టములు= చిక్క