ఈ పుట అచ్చుదిద్దబడ్డది
312

హరిశ్చంద్రోపాఖ్యానము

వీరిడిపగిది వివేకంబు మాలి
పని లేనిజగడంబు పై కి రాఁ దిగిచి
యనఘ వసిష్ఠుమహామునిసింహుఁ
గలఁచి నా దెస కేల గవియించుకొంటి
వల దని సుర లైన వారింప రైరి
జగతిలోపల హరిశ్చంద్ర భూవిభుఁడు ...........................27 60
పొగ డొందె నేమి తాఁ బొగడొందఁ డేమి
బొంక కుండిన నేమి బొంకిన నేమి
కింకరిపడి పరికింప నా కేల
నేలకు నింగికి నెటీ సూత్ర పెట్ట
లెడునా బుద్ధి సమసె నేడనుచు
నొగి వేటు దప్పుటయును జొహా రనెడు
పగిది సన్నిధి యైన భర్గాదిసురులఁ
గని మొక్కి పార్థివుఁ గౌఁగిటఁ జేర్చి
మనమున హర్షించుమాటలు వలికి
‘బడలితి వెంతయు భానుకు లేశ...................................2770
జడమతిఁ బూని నీసత్యంబు పెంపు
సొలవక నొరసి నేఁ జూచుట కిట్లు

.............................................................................................................

చకు దానిని నిలుప లేక తానే బాధనొందునట్టి వెర్రిఱ వానివలె, కవియించుకొంటి = ఎదిరించునట్లు చేసికొంటి, కింకిరిపడి = కోపపడి, పరికింపన్ = పరీక్షింప, నేల కునింగి... నా బుద్ధి= భూమికి ఆకాశమునకు సరిగా సూత్రము పెట్ట సమర్థమైన నాబుద్ధి-భూమ్యాకాశముల కవలీలగా వ్యాపించునట్లు అతివి స్తీర్ణ మైన నాబుద్ధి యనుట, సమ సె = నశించెను, వేటు ... పగిదిన్ - వేటు తప్పిపోఁగా జోహారని మొక్కునట్లు అందిన చోతలయును, అందనిచో కాళ్లును పట్టుకొనునట్లు, లేకవ్రేటు తప్పఁగా నే జోహరన్నట్లు తటాలున, పార్థవు న్= రాజును, ఒర సి= ఒత్తి,