ఈ పుట అచ్చుదిద్దబడ్డది

307

ద్వితీయ భాగము.

గిరిశ రాసన రౌప్య గిరిశృంగనిలయ
గిరికన్యకాప్రియ గిరి భేది జనక
వేదమ స్తకముల వెలయునీదివ్య...............................2660
పాదపద్మములు నాఫాలంబు సోఁక
నరయఁ గృతార్థుండ నైతి లోకముల
దురితంబు లన్నియుఁ దొలఁగింపఁగంటి”
నని పెక్కు భంగుల నభినుతి సేయ
జననాథువలనఁ బ్రసన్నుఁడై శివుడు
రాజేంద్ర నీవంటి రాజు నాయేలు
నీజగంబులలోన నెవ్వఁడు లేఁడు
మేలు నీసత్యంబు మేలు నీ తెంపు
మేలు నీ ధైర్యంబు మెచ్చితి నడుగు
వరము లే మిటి వేఁడు వలసిన'వ నుచుఁ.........................2670
గరమున మే నంటి గౌరవం బమరఁ
గలకంఠములచాయ గల దనగూర్మీ
కలకంఠివంక కై కడకంటిచూపు
నిగిడించుటయు సిగ్గు నెక్కొని విభుడు

............................................................................................

జూటముగలవాఁడా, గిరిశరాసన = కొండయే విల్లు గాఁగలవాఁడా, కౌ గిరిశృంగనిలయ= కై లాసశిఖరము వాసస్థానము గాఁగలవాఁడా, గిరికన్యకా య = పార్వతికి వల్ల భుఁ డైనవాఁడా, గిరి భేది జనక = క్రౌంచపర్వతమును భే చిన కుమారునికి తండ్రియైన వాఁడా, వేదమ స్తకములన్ వేదశిరస్సులను పనిషత్తులందు, దురితములు= పాపములు, కలకంఠ ...వెంక కై = కోకిలము వన్నె గల తన గారాబుపడఁతి దెస కై -నల్లనిచాయగల గౌరిదిక్కు. అనుట,సిగ్గు క్కొని విభుఁడు = రాజు సిగ్గునొంది, మునుకుచు=మిణకరించుచు, సాదలనీరు ....