ఈ పుట అచ్చుదిద్దబడ్డది
296

హరిశ్చంద్రోపాఖ్యానము

పఱచినవానిని భయమునఁ బూరి
గజచినవానినిఁ గైదువుఁ బూన
మఱరిచినవానిని మజిదిక్కు లేక
మఱుగుఁ జొచ్చినవాని నదిలోనఁ గరుణ ..................2460
నెఱయఁ బ్రోచుట నాకు నియమ వ్రతంబు
పరికింప నిట్టిచో బడలినయబలఁ
దెరలక ఘోరాసిఁ దెగ వ్రేయు మనుచు
నాకడ కంపించినాఁడు నా స్వామి
నా కేల వగ పన్న నా కేలు సాగ
దీకిడుఁ గావింప నిది తప్పుత్రోవ
యేక్రియ గల దింక నేమి సేయుదును
సుతుని దుర్మృతికి నేడ్చుచు మతి కూర్మి
సతిఁ గృపాణాహతిఁ జంపఁ బాలయ్యె'
నని యశ్రు లొలుక మీ మర వాంచి యున్న.............. 2470
మను జేశునకుఁ జంద్రమతి యిట్టు లనియె
'నినకులాధీశ నీ వెఱుఁగనియట్టి

......................................................................................................


విశ్వామిత్రునిబూటకములన్నియుఁ దీరిపోవుననిభాపము. పూరిగఱచిన వానిని= కశవునోటఁబెట్టుకొన్న వానిని, కైదువు పూనకన్ = ఆయుధమును దాల్చు ట కు, పరికింపన్ = విచారింపఁగా, బడలినయబలన్ :అలసియున్న స్త్రీ ని, అలయక యున్న పురుషు నే శరణుఁ జొచ్చినచోఁ బ్రోవవలసియుండఁగా అల సిన స్త్రీని కత్తితోనఱకుట యెట్లు అనిభావము, నాకడకు అన్నక్ = నాయేలిక నా చెంతకుఁ జంపుమనిపంపినాఁడు గాని నేనె చంపఁ దీసికొనిరా లేదు కాఁబట్టినాకు దీనిని గురించి విచార మెందుకు అన్నచో, నా కేల సాఁగ దీకీడు గావింపన్ = ఈ చెఱుపును జేయుటకు నా చేయి నిగుడఁజాలదు.ఇది తప్పుఁ ద్రోప= నా చేయి సాగకుండుటయు తప్పుమార్గము, కృపాణాహతిన్ = కత్తివాటున, పా