ఈ పుట ఆమోదించబడ్డది
26

హైందవ స్వరాజ్యము.

మానులు కారని యోచింపవలసివచ్చుచున్నది. సామాన్యముగా లంచము తీసికొననివాడు ఇయ్యనివాడు ధర్మపరు లనుకొందు రేని వీరు ధర్మమార్గానువర్తు లనుకొనవచ్చును. అయినలంచ ములకంటె సూక్ష్మతరమగు ప్రోద్బలములు లేక పోలేదు. తమ కార్యములను సిద్ధింపచేసికొనుటకు వారితరులకు బిరుదములను లంచములిచ్చుట సామాన్యముగానున్నది. వారియందు నిజమైన ధర్మపరతకాని కళాసహితంబగు అంతరాత్మకాని లేదని నేను స్పష్టముగా చెప్పగలను.


చదువరి: మీరు రాజ్యాంగ సభనుగురించి ఇట్టి భావములు చెప్పుచున్నారే. ఇంగ్లీషు ప్రజనుగురించి యేముందురు? అప్పుడు వారి ప్రభుత్వమును గురించి ఆలోచించుకొందును.


సంపా: ఇంగ్లండులోని నిర్వాచకులకు వారి వార్తాపత్రికలే వేదగ్రంథము. వారు వీని ననుసరించి తమయభిప్రాయములను తీర్చుకొనుచున్నారు. పలుమారు ఈ పత్రికలు అబద్ధములు వ్రాయును. ఒకేవిషయమును ఇవెల్లయు తమతమకక్ష యొక్క లాభమునకు అనుకూలించనట్లు వేరు వేరురంగులతో చిత్రించును. గొప్ప యింగ్లీషునాయకుని నొక పత్రిక మహాసాధువని ఆకసమునకు పొగడును. అతనినే మరియొక పత్రిక అన్యాయము యొక్క అపరావ తారముగా నిశ్చయించును. వార్తాపత్రికలీ స్థితియందుండవ లెనన్న ప్రజల స్థితి యెట్లుండవలెను?