ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

ఆంధ్రభాషాలతలు దేశమందంతటను నల్లి బిల్లిగ నల్లుకొని యున్న తరి అందు రాజకీయ విషయిక సూనంబులు కానరా కుంట శోచనీయము. హైందవ జాతీయత ప్రతి భారతీయని అంత రాళముల రాణీల్లుచున్నయది. యుగంధరుని యుత్తమ రాజకీయ తత్వజ్ఞత, త్రిమ్మరుసు రాజ్యాంగ నిర్మాణ కౌశలము మనవారి రక్తనాళముల బ్రవహించుచున్నయది.

భారత దేశమున మనవార లె మున్ముందు దేశ భాషల ప్రాము ఖ్యతను కనుంగొనిరి. ముద్దులు మూటగట్టు మన తెలుంగే మన లను ద్బోధమునకు పురికొల్పగలదు. ప్రబోధంపుమొలకలు యిప్పుడిప్పుడే చిగిర్చి వికసించుచున్న వి.

ఫాశ్చాత్యు లెల్లరును ఆధ్యాత్మిక ధర్మమును తూలనాడి ఇహమే నిశ్చయమని నాగరికత, నాగరికత" యని పేరు పెట్టుకొని తుదకు ఐరోపామహాసంగ్రామమున ఒకరి నొకరు చిత్రవధల "గావించికొనిరి. ఇప్పుడిప్పుడే ' వారికి వారి నాగరికత వట్టిమిధ్యయని గోచరమగుచున్నది. హైంద వుల జీవనమే యుత్తమమని ఇప్పుడే వారు కన్నులు విప్పి చూచు చున్నారు. మనము భారత సందేశమును లోరమంతటికిని