ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

259

గుఱుతులు మే మెఱుగుదు మంతటికిని
దెఱఁగొప్ప నీవు నే తెమ్ము మా వెనుక'
ననుచు బోధించి వారటు గొనిపోయి
మను జేశ సుతుఁడు నెమ్మనమున నలర ......................1790
ఫలములు దర్భలు పసిమాకు కసవు
కలయంగఁ దోడ్పకి కట్టగాఁ గట్టి
సమిధలు దల కెత్తి “చను'మన్న మొగము
చెమరింపఁ గూఁటి చీకాకు పడఁగ
దడవడంకులు గొంచుఁ దను వెల్లఁ గంద
నడుగులుదొట్రిల్ల నల్లన నడచి
వచ్చి యల్లప్పటివటమూలమునను
జెచ్చెరఁ దలమోపుఁ జేర్చి రాసుతుఁడు
చల్లని జలము లచ్చటి గుంట ద్రావి
మొల్లన మరలి యాయుర్వీరుహుబు..............................1800
నీడఁ గొండొక సేపు నిద్రించి తన్ను
గూడి వచ్చినవడుగులు దలఁపింపఁ
“మనములో నిందాక మఱచి యున్నాఁడ'
ననుచుఁ బర్ములు రయంబునఁ గోయ
నొక కాలు పుట్టపై నూఁది యాసాద
మొక కొంత నిక్కి మ్రా నూతగాఁ దొక్కి

................................................................................................

గాగైన, ప్రేరేచి = పురికొల్పి, గుఱుతులు ... మంత టికీని=కందమూలఫలాదు జడుచోట్ల గుఱుతుల నెల్ల తెలియుదుము, దడపడంకులు = మిక్కిలి 'కోపమును, అల్ల ప్పటి=ఆ, తల మోపు తలమీఁది బురువు, ఒల్ల నన్ = మెల్ల గా, 'ర్వీరుహము= చెట్టు, తలఁపింపన్" = ఆకులు గొనిపోవలయునని తలఁపింపఁగా,