ఈ పుట అచ్చుదిద్దబడ్డది
252

హరిశ్చంద్రోపాఖ్యానము.

పరఁగ గుణించెడు బ్రహ్మరాక్షసులుఁ
గ్రందుగాఁ గలిగి వెక్కసమును వెఱుపు
నందంద యొదవించునారుద్రభూమి...............................1650
నారాజ శేఖరుం డటఁ బ్రవేశించి
ధీరుఁ డై నిజఖడ్గ దీప్తులు నిగుడఁ
పేరము సుడివడ నొడిసి
పట్టి కూతలుఁ బెట్టి బలువిడి మోఁది
యెల్ల భూతంబుల నెల్ల డాకినుల
నెల్ల శాకినుల మోహిని పిశాచములఁ
గనుఁగొని “నేఁ డాదిగా మీరు గూడి
చని వీర బాహునిసదనంబునందు
వెట్టి గొట్టము నీళ్లు వెలయంగఁ గనవు
కట్టెలు నివి యాదిగాఁ గలపనులు.....................................1660
పగ లెల్లజేసి మాపటి కిట వచ్చి
తెగువ మై నీకాడు తిరుగ రా నుండి
యెచ్చట నెవ్వరు నెఱుఁగక యుండ
వచ్చి పీనుఁగుఁగాలవైచి పోకుండ
నా లీల కోజువిదయ్యంబుల దివ్వె
కోలల నారిగాఁ గొని గస్తు దిరిగి

.........................................................................................................

దయ్యములు, సరిఁగూడి= సరి గా జతిగూడి; వెక్క సము= వేండ్రము, పేరము= పరుగు - చుట్టు, సుడివడన్ =తడ బడఁగా, వెట్టి=కూలిపని, కొట్టము=పసుల కొట్టము, కాడు=శ్మశానము, తిరుగరానుండి = చుట్టితిరిగి. ఎచ్చట... పోకుం డన్ = ఎచ్చటఁగాని ఎవరైనను తెలియకుండునట్లు పీనుఁగును కాలఁబెట్టి పో కుండునట్లుగా, దివ్వెకోలలవారు = ది వ్విటీవారు, పొడచూపక = తము ఆగ