ఈ పుట అచ్చుదిద్దబడ్డది
242

హరిశ్చంద్రోపాఖ్యానము.

నినుమడిఁ బెట్టిన నింక నొండొకని
కేగతి నిను నమ్మ నితనికే కాని
శ్రీగురునాన కాశీనాథునాన"
యని రాజు మునిపుత్రుఁ డాడువాక్యముల
విని యంత్యజుఁడు మోము వికసింపఁ బలి కెఁ
“బరిణమించితి నిన్ను బాఁపనవడుగ
తిరుగక యీమాట తిరముగా నిలుపు......................................1470
వక్క సేయని లేకివాఁడని నన్ను
సేయక కరాళించె నీ రాజు
వాటమై యీమాట వడి నమ్ము వోలె
నాటి యున్నది నేడు నా మనంబునను
గెంటక యీయప్పు గెంటి యీ తులువ
బంటు గా నేలక పాయదు కోప
మప్పు ధసం బింత యని గురి నాకుఁ
జెప్పుము చెల్లింతుఁ జేకొను' మనిన
నలరి నక్షత్రకుఁ డతనితోఁ దెలియఁ
బలికె 'నీ భూపాలు పై తరు వనెడి....................................1480
చేతిసంకెల వీడఁ జేసెద వే ని
దాతవు నాపాలిధర, దేవతవు

..............................................................................................................

న... నమ్మను = నీవియ్యపలసిన ధనమునకు రెండింత లి చ్చెదనన్న ను వీనికిదప్ప వేరొక్కనికి ఏవిధమునను అమ్మను, అంత్యజుఁడు మాలవాఁడు, పరిణమిం చితి= మొక్కితి, తిరము గాన్ = స్థిరముగా, కరాళిం చెన్ = భీష్మము గాపలి కెను, అమ్ము= బాణము, గెంటక = వెనుదీయక , గెంటి= తొలఁగించి, గుఱ= కొ లఁది , మేర, తరువనెడి చేతిసం కెల = చేతిసం కెలవ లెనుం డెడి నాతప్సీలు, -