ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

237

తొలులు వోయిన ప్రాతతోలును గప్పి
బలుగత్తి మొల నచ్చు పడ నమరించి
కడుమైల పేలిక గాసించి నడుము
బడికి వేసిన యరపట్ట బిగించి...................................1380
యెడమచేఁ బశుమాంస మేర్చినగుదియఁ
గడమచే నినుపయుంగరములగుదియ
గడజాతిగాఁ బూని క్రందుసందడిని
జడియుచు శంబళి శంబళి యనుచు
దళముగా మెఱసెడితన మేనికుష్టు
పొలసుకు జుమ్మని పొలయుమక్షికల
గుంచియతోఁ జోఁపు కొనుచుఁ బెన్నలుపు
మించి కందెన నూనె వేఁగినట్లున్న
'మొగమునఁ జీఁకట్లు ముడివడఁ గల్లు
సగము ద్రావినకుండఁ జంకట నిటికి..............................1390
మీరినమదమున మెయి దేల గిలఁగఁ
బాఱంగ వెడపాటఁ బాడుచు బయలు
జాఱుచు నల్ల సచ్చనిపొడి మ్రింగి

..................................................................................................................

యిన = తూట్లుపడిన, కడుమైల పేలిక = మిక్కిలిమాసిన చింపిగుడ్డ, కాసించి= కా సాగాలగట్టుకొని, అరపట్టె= ఒడ్డాణము, ఏర్చిన గ్రుచ్చిన, కడమ చేన్ = డాచే త, కడజాతి గాన్ = చండాలజాతికి సూచకముగా, క్రందుసందడిని= అలముకొ నుగలబకును, జడీయించు= జళిపించు, మక్షికలు= తేనీఁగలు, కుంచియ=కుచ్చు, పెన్న లుపు-= కటికి నలుపు, కందెన నూనె = బండికీలునూనె, మేఁగిన=పూసిన, మిక్కుటమైన, చీఁకట్లు = చీఁకట్లవంటి నల్లఁదనపు కాంతులు. మీరినమద మునన్= అతిశయించిన కావరము చేత, తేలగిలఁగన్ పాఱగన్ = తేలికగానుం డఁ గా, మేనును ఇచ్చవిచ్చినట్లు మత్తు చేవిదుల్పఁ గాననుట, పెడపాట = సన్న నిపాట,బయలుజాఱుచు =ఇటునటు తొలఁగుచు, నల్లపచ్చని పొడి