ఈ పుట అచ్చుదిద్దబడ్డది
236

హరిశ్చంద్రోపాఖ్యానము

గోరినధన మిచ్చి కొనరయ్య మీరు
బేతాళుతలఁ దైవ్వ వేసి సన్మునుల
భీతి నివారించి పేర్చినయట్టి...................................1360
వీర శేఖరు జగద్వి ఖ్యాత చరితు,
గోరిన ధన మిచ్చి కొనరయ్య మీర'
లని వాడవాడల నమ్మున మ్మునత్తరిని
బెను పొందు పేరును బెంపును జెప్పి
యవనీశు మునిపుత్రుఁ డమ్ము వాక్యములు
సెవుల సోఁకుటయునచ్చెరువంది చెలఁగి
పొదలు పాపంబులు పూదోలి ముక్తి
గదియించు మణికర్ణికాసమీపమున
మతమారఁ దనతపోమహిమఁ గౌశికుఁడు......................1370
పితృవనం బొకటి గల్పించి యా మున్నె
యురుశక్తి వీర బాహుని పేర జముని
బరఁగిన చండాలపతిగా సృజించె
కుఱు వెండ్రుకల కోరకొప్పిడి కాని
యఱవుడు తలనిట్టు నట్టును జుట్టి
జేగురుబొ ట్టిడి చెవి సంకుఁగొడుపు
లాగుగా వ్రేలఁ దెల్లని ముడ్సు నిల్పి

.......................................................................................................

ర్చు, మతమారన్ = మతము చక్కఁగా ఆలోచించి, పితృవనము = రుద్రభూమి " ఉరుశ క్తిన్ = గొప్ప సామర్థ్యము చేత, వీర బా... సృజించె= యముని వీర బాహుఁ డను పేరుగల చండాలపతి గా సృజించెను, కుజు ...ప్పిడి=కుఱుచనైన వెండ్రు కలను మడిచియోర గాకొప్పు పెట్టి, కావియఱవుడు=చింపులు గానుండు కావి గుడ్డ, సంకుగొడుపులాగుగాన్ =శంఖము కో పువలె, ముడ్సు = ఎముక , తొలులువో