ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226

హరిశ్చంద్రోపాఖ్యానము

నేపరించుచుఁ బతి కెదురు భాషించు
పాపాత్మురా లూరఁబందియై పుట్టు”
నని పెక్కు భంగుల నా రాజు దేవి
దను మోవ నాడినధర్మ వాక్యములు.......................1180
గన లెడుసూదులు గర్ణరంధ్రములఁ
జొనిపినయ ట్లైన సురసుర స్రుక్కి
కండ క్రొవ్వునఁ గాల కౌశికుమాఁద
మండు కోపము చంద్రమతిమీఁద విరిసి
'పాడిఁ జెప్పఁగ నిన్ను ( బనివడి యిచటి
కేడ ముక్కిఁడి పిల్చె నిఁక నింత నుండి
బాడుగ నీ కిచ్చి పతిభ క్తి సేయు
జాడ లన్ని యు నీదుసంగడి నేర్చి
నీవు వంకలు దీర్ప నీ పంపుపనులు
గావించు చుండెదఁ గాక వేగిరమె........................1190
న న్నెఱం గెదు గాక నా పేరు తెలియ
విన్న మృత్యువు కైన వెర వేఁకి వచ్చుఁ
గదలి నే రోకలి గైకొన్న వలన
గడలుదు రీవాడగరిత లందఱును
నాపొడ గాంచిన నగరంబు వడఁకు

...........................................................................................................

దుఃఖపఱుచుచు, తను మోవన్ = తన్ను దాఁకునట్లు, కన లెడు = మండుచున్న, పాడి = నీతి, ఏడ ముక్కిడిఁబి ల్చె- ఈముక్కిడి నిన్ను నీతి చెప్పుటకై యెక్క డఁ బిలిచినాఁడు, ఇంతనుండి = ఇది మొదలు గా, బాడుగ = అద్దె, నీదు సంగడిన్ = నీ సాంగత్యమున, వంకలు =తప్పులు, వెర వేఁకి = మిక్కుట పుజ్వరము, రోఁకలిఁ గైకొన్న వలన=రోఁకలి యెత్తి కొని కొట్టఁబోయిన దిక్కున, గరితలు= స్త్రీలు