ఈ పుట ఆమోదించబడ్డది
18

హైందవ స్వరాజ్యము.

కావలసిన దంతయు వచ్చునెడల ఇంగ్లీషువారిని వెళ్లగొట్టుట మీకు అవసరమని తోచుచున్నదా?

చదునరి: నేను వారికి ఒక్క ప్రార్థనయేచేయుదును. “దయచేసి దేశము విడిచి వెళ్లి పొండు." ఈ ప్రార్థననంగీకరించిన తరువాత వారు వెళ్ళిపోవుట యనిన ఇచ్చట నేయుండుటయని అర్థమగునేని నాకభ్యంతరముండదు. అప్పుడు మనభాష ప్రకారము పోవుటయనగా ఉండుటయని యర్థమగునని నాకు తెలిసియుండును.

సంపా: కాని, ఇంగ్లీషువారు వెళ్లిపోయినారని యనుకొందము తరువాత మీరేమిచేయుదురు.


చదువరి: ఆప్రశ్నకు ఇప్పుడర్ధము చెప్పుటకు రాదు. వారి వెళ్లిపోవువిధమునుబట్టి వారు వెళ్లి పోయిన మిూదట నుండుస్థితి యేర్పడగలదు. నూ రనుకొనురీతిని వారు ఇచ్ఛగా వెళ్లి పోవు నెడల వారి రాజకీయ సంస్థల నట్లే యుంచుకొందుము. పరిపాలన చేసి కొందుము. మనము అడుగుటతోనే వారు నెడలిపోవు నెడల మనకు కావలసిన సైన్యాదికములు చే జిక్కును. పరిపాలన సాగించుట తరువాత మనకు కష్టము కాకూడదు.


సంపా: మీరట్లనుకొనవచ్చును, కాని అది నామనస్సునకు సరిపోలేదు. అయినను ఆవిషయమునుగురించి ఇప్పుడే చర్చ చేయ దలపెట్టలేదు. మీ ప్రశ్నకు నేను ప్రత్యుత్తరము చెప్ప