ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

205

సుతునితోఁ గూడ నీ సుందరి దక్కె
వితతంబు గాఁగ నీ వి ప్రముఖ్యునకు'
నని తనచక్కిగా నా ధూర్తవిప్రుఁ
డొనరఁ జెప్పినమాట కుత్సాహ మంది
కాలకౌశికుఁడు నక్షత్రకుఁ గ్రుచ్చి
యాలింగనముఁ జేసి యధిపుక ట్టెదుర
వెక్కిరించుచుఁ గోల విసరుచు నోరు
వెక్క సంబుగ విచ్చి వెడనవ్వు నవ్వి
గంతులు వైచుచుఁ గర తాళగతుల...............................810
నంతంత నాడుచు నంతటఁ బోక
పడుచు లార్వఁగఁ జుట్టుఁ బరువులు వాతి
కడఁగి చూచెడివారిఁ గదలఁ దోలుచును
బలువిస్వరంబులఁ బనసలు కొన్ని
చెలఁగి త్రప్సలు మీఁదఁ జిలుకఁ జెప్పుచును
జెనఁటిగోఁతికి వీర్ల శివ మె త్తి నట్లు
కనుక నిఁ బెక్కు వికారముల్ సేయఁ
జూడ రోయుచు మహీశుఁడు మదిలోన
నేడ ధర్మం బింక నెక్కడితగవు

...........................................................................................................

కుని అధీనమయ్యెను, తనచక్కి గాన్= తనపక్షముగా, కరతాళగతులన్ : చ ప్పెట్లచఱచుచు,పడుచులు=పడుచువాండ్లు, ఆర్వఁగ = పరిహాసముగా కోయని యఱచునట్లు, కడఁగి చూచెడి వారిక్ = తాను పరువులు వారుటను పూనిచూచు నట్టివారలను, కదలఁబోలుచును= పోవఁదఱుముచును, బలువిస్వరంబుల= పె క్కువికారస్వరములతో, పనసలు=ఋక్కులు, త్రప్పలు=నోటి తుంపరలు, చెనఁ టి... వీర్ల శివము = వెర్రికోఁతికి వీరులయావేశము, కనుక నిన్ - వేవేగ, వంశ నా