ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1.

202

హరిశ్చంద్రోపాఖ్యానము

కొడుకుఁ గోమలిఁ దోడుకొనుచు నీ యింటి..........................750
కడ కేఁగెదవొ లేక కాజులు వల్కి
కినిసి బ్రాహ్మణుని శిక్షింప లేరనుచుఁ
జెనఁటికోడిగములు సేసి పోయెద వొ'
నావుడు విప్రుఁ డన్న రపతి కనియెఁ
గావరంబున నోరు గడవ నాడెదవు
విడి కల్ల లాడినఁ జేరునే ధనము
కడపట నీకు నక్కఱ దీర దేని
పన్ను గాఁ గత్తియు బలపంబుఁ బూని
కన్న పెట్టుము సిరి గలవారియిండ్లు
'నీచాత్మ ప్రొద్దున నీవు నా మొగముఁ..................................760
జూచితి గాన నాసొమ్ము నీ కబ్బె
దివిరి నాకులము నిందించి నాగుణము
వివరింప నీ కేల వియ్య మందెద వె
నను విప్రుఁ డని కాచినాఁడవు గాక
కినిసి కాకున్న శిక్షింతువే నీవు

..........................................................................................................

=రజ్జులు, కినిసి ... రనుచు= ఎవ్వరు గాని బ్రాహణుని కోపించి దండింపఁజాలరని చెనఁటికోడిగములు = వ్యర్థ పుతుంటతనములు, కావరమునన్=క్రొవ్వు చేత, నోరుగడవనా డెదవు =నోరికి మించిమాటా డెదవు నోట సెంత చెప్పవచ్చునో యంతకు హెచ్చు గాపలి కెద పనుట, “చెడి ...ధనము = ఐశ్వర్యము చెడినవాఁడు అబద్ధములాడి సంపాదింపవలయునన్న యెడల ధనముపచ్చి చేరు నాయనుట, అక్కఱ=అప్పునిర్బంధము - పెండ్లమును బిడ్డను అమ్మికూడ అప్పుదీఱ దేని, కత్తి= కన్నపుఁగత్తి, బలపము = కన్న పుజాయి, నా మొగము........ నీక బ్బె= ఇది హరిశ్చంద్రుఁడు నీ మొగము ప్రొద్దునఁ జూడరాదన్నందులకు కాలకౌశికుఁడు చె. ప్పినబదులు, 'కినిసి... నీవు కాకున్న నీవు కిసిసిశిక్షింతువే = బ్రాహ్మణుఁడనికాక