ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

191


బరభయంబునఁ జిక్కి పారినీ మఱుఁగుఁ
జోరఁ బాఱ దగునె యి యీచొప్పగు నేని
బాణాసనం బేల బాణంబు లేల
ప్రాణంబు లేల కృపాణంబు లేల
ప్రబలమత్తేభ కుంభస్థలమాంస
కబళమహోల్లాసకంఠీరవంబు
ముదిసిన నాఁకొన్న ముట్టఁ జిక్కి నను
బొదలుమాంసము డించి పులు 'మేయఁ జనునె
దారుణక రవాలధారాహ తారి
వీరకోటీరనవీనమాణిక్య............................................590
రంగవల్లీ రణరంగ విఖ్యాత
మంగళ విజయరమాకరగ్రహణ

...................................................................................................................


యపడి మమ్ము శరణుసొరఁగా మేము కాపాడువార మే కానీ మేముభయపడి నీబోఁటివాని మఱుఁగుఁజొచ్చువారము గామనుట, ఈచొప్పుఅగు నేని= ఇట్లు ని న్న శరణుజొచ్చుట మాకుఁగలి గెనేని, బాణాసనంబు = విల్లు, కృపాణము=క త్తిప్రబల ... కంఠీరవంబు - ప్రబల= మిక్కిలి బలవంత మైన, మత్తేభ =మదపుటే నంగుల యొక్క, కుంభ స్థల= కుంభ స్థలములందలి, మాంస=మాంసమును, కబళ = మ్రింగుటయందు, మహోల్లాస = మిక్కిలియుల్లాసముగల, కంఠీరవంబుజ సింహ ము, ముట్టజిక్కి నను=పూర్ణముగా పట్టువడినను, పులు=గడ్డి, దారుణ ... ప్రళ సము - దారుణ భయంకరమైన, కరవాల ధారాబక త్రీవాదర చేత, హత = చంప బడిన, అరికా శత్రువుల యొక్క, వీరకోటీర = వీర సూచకము లైన బాహుపురులం చలి, నవీనమాణిక్య=క్రొత్తమణుల చేత నైన, రంగవల్లీ = మ్రుగ్గులుగల - శత్రురా జుల భుజములను నఱుకఁగా వారిబాహుపురులనుండి రాలినరత్నముల చే మ్రుగ్గు లు పెట్టఁబడినయనుట, రణరంగ = యుద్ధరంగమనెడి పెండ్లిరంగమందు, విఖ్యా త-పొగ డ్తకెక్కిన, మంగళ =శుభమైన, విజయరమా= జయలక్ష్మి యొక్క, కర