ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

187


బ్రాతిగా వెడలింప బడుగులు లేవు
బొమ్మరాకాసుల భోజనమ్ములకు
రమ్మని ప్రార్థింప రాఁ డొక్క రుడు
పిండివంటలు నెయ్యి బెల్లంబు పప్పు
గండశాంతులఁ దృప్తిగాఁ దిన లేదు
సప్తకంబులఁ బాయసము నెయ్యి పెరుఁగు
తృహస్థ గా జుర్రిత్రేన్ఫంగ లేదు -.............................520
కడికడి కొక మాడ గ్రహణ కాలమున
వడి వీడ దోవతి వదలించు కొనుచు
బరు లుబ్బఁ బృష్టోష్ణ పర్యంతముగను
బెరుఁగువంటకము పేర్పెఁడు దిన లేదు
లేదో మృత్యువు చంప లేఁడొ జముండు
కాదేని చావులు గఱ వాయె జగతి
నీకొట్టికకు విపుఁ డెట్లు చే రెడీని
గైకొని బ్రతుక నే గతి గల దింక
మ్యూక లై జనులు నికూల మై చనిరొ
కాక నా వీనులఁ గవి సెనో చెవుడు..........................530

..............................................................................................


గా, వెడలింపన్ = కాటీకిఁ గొని పోవుటకు, బడుగులు=చిక్కిన దేహముగలవారు, బొమ్మరా కాసుల భోజనమ్ములకు = బ్రహ్మరాక్షసులభోజనములకు, గండశాంతులవ్ = ఉపాయనిష్పత్త్యర్ధమైన నివారణములందు, సప్తకంబులన్= స ప్రకాశ్రాద్ధము అందు - ఏడుగురినిబిలిచి పెట్టుశ్రాద్ధములందు 'తృప్తిస్థ' గాన్ = 'తృప్తుల మైతిమి' అనునట్లుగా, తేన్పంగన్= త్రేపులు విడుచుటకు, కటిక డికి= ముద్దముద్దకు బరులు బ్బి= ప్రక్కలు బలియునట్లు, పృష్ఠ ఓష్ఠ పర్యంతముగను= పెదవి మొదలుకొని వీఁ పువఱకును, పేర్పెఁడు= ఒక టిమీఁదనొకటి గా, కొట్టిక = ఊరు, వీనుల ... చెవుడు, వావులు ఈయూమునందు చాలఁగలిగియునా చెవుడు చే నాకు వినరాకున్నదోయ