ఈ పుట అచ్చుదిద్దబడ్డది
182

హరిశ్చంద్రోపాఖ్యానము

కఠినచిత్తులు లేరు గాక లోకముల
శఠ మేల నృపులతో సంయమీంద్రులకు
వెడమతు లైనయీవిపులజాడ
వడిముడిగాఁ జొచ్చి వాత వెళ్లుదురు
ఉపకార మోపిక నొనరించువారి
కపకార మొనరింతు రప్పుడే కడఁగి
యలగుజ్జువడుగు మూఁ డడుగుల నేలఁ
దొలితొలి బలి వేఁడి తుది నెట్లు సేసె
మరి కశ్యపాది బ్రాహ్మణు లిల యెల్లఁ
బరశురాముని చేతఁ బడసి యా ఘనుని.........................440
నుదధిలోనై నఁ గా లూఁదంగ నీక
కదలి పోఁ దోల రెగజిబిజి సేసి
యివి యన్ని యేటికి నీకౌశికుండు
తివిరి విప్రుఁడు గాక తిరిగెడునాఁడు
సొలపు దీరఁగ వసిష్ఠునియింటఁ గుడిచి
తొలగి పోవుచు నెన్ని దొసఁగులు సేసె
నిదె మహీతెలమెల్లనేలునీ రాజు
చెదరక యిట్లేడు చెట్లను జెఱచి
పోనీక బందెలఁ బొరలించి తపసి
దానవుం డై నల్ల ద్రావు చున్నాఁడు...........................450


.........................................................................................................


రత్వము, సంయమీంద్రులకున్ = ముని శ్రేష్ఠులకు, వడముడి గా - వెళ్లుదురు= భయంకరముగా నోటిలో జొచ్చి తిరుగ నోటినుండియే వెడలుదురనుట, గుజ్జున్ డుగు= పొట్టిమాణపకుఁడగు వామనుఁడు, ఉదధి=సముద్రము, దొసఁగులు= కీళ్లు,ఏడు చేట్లను చెఱిచి= సప్తవ్యసనములను భంగ పెట్టి, బందెలన్ పొరలించి- నిర్బంధములఁ జుట్టి, దానవుండై నల్ల త్రావుచున్నాఁడు= రాక్షసుఁడై నెత్తురు