ఈ పుట అచ్చుదిద్దబడ్డది
180

హరిశ్చంద్రోపాఖ్యానము

చెలగి నా యక్కఱఁ జేకొనరయ్య'
యని దైన్య మేర్పడ నమ్మహారాజు
దన పత్ని నముదుర్దశఁ జూచి పొక్కి
వాడవాడల నెల్ల వారలు గుములు
గూడి యశ్రులు జడిగొనఁ దమలోనఁ
'గటకటా యిట్టి వెంగ లిరాజు గలఁడె
మటుమాయత పసి యేమరులు గొల్పినను.....................410
నెమ్మదిఁ దనయేలు నేలకుఁ దోడు
సొమ్ము లన్నియు నిలుచూఱగా నిచ్చి
యమ్మెదఁ గడమ కై యాలి. గొం డ నెడుఁ
దమ్ము మాలినయట్టిధర్మంబు గల దె
యివ్వనుంధరఁ బుణ్య మెంతయుఁ జేసి
యెవ్వరు బొందితో నేఁగిరి దివికిఁ
జదువులు విని మీఁద జరుగుసౌఖ్యంబు
మది నమ్మి బ్రతుకు బ్రాహ్మణునకు నిచ్చెఁ
బనుపడ మొగిలులోపలినీళ్లునమ్మి

....................................................................................................................

గుములు= గుంపులు, అశ్రులు=కన్నీళ్లు, జడిగొనన్ = వానవలెఁదొరుఁగగా, వెం గలి: =వెర్రి, మటుమాయతపసి= మిక్కిలి మాయలు చేయుముని,మరులుగొల్పినను = మోహ పెట్టినను-తబ్బిబ్బుక త్రాగించినను, తనయేలు....దోడు = తాను ఏలునట్టిభూ మితో 'ఁ గూడ,నిలుచూఱ= నిలువుకొల్ల-ఆపాదమ స్తకము గలనిలువు సొమ్ములన్ని యును కొల్ల గాననుట, కడమ కై = మిగతయప్పున కై , తమ్ముమాలినయట్టి ధర్మము, గలదే తనకుపయోగింపనట్టి ధర్మమునుగలదా తన కుపకరింపనిధర్మ మొకధ ర్మమగు నాయనుట , వసుంధర=భూమి, చదువులు= వేదశాస్త్రాదులు, మిఁదజ రుగుసౌఖ్యంబు = రాఁబోవు సుఖములు-స్వర్గరంభాభోగాదులనుట, బ్రతుకు= జీవ నము - జీవనాధారమైన భూ రాజ్యధన దారాదులు, పనుపడ =గట్టిగా, మొగిలు