ఈ పుట అచ్చుదిద్దబడ్డది
172

హరిశ్చంద్రోపాఖ్యానము

నాలును బిడ్డలు నర్థంబు నెపుడుఁ
గాలిసం కెల లెల్ల కడలను బతికి
మఱచియు వీనిపై మక్కువ సేయ
రెఱుక గల్గిన ధీరు లెల్ల కొలంబు
వక్రంబుగా నాడ వలదు న న్ని పుడు
విక్రయింపఁగ వేళ విచ్చేయు' మనుచు
ముదమునఁ జాఁగిలి ( మొక్కి హస్తములు
గదియ మొగుడ్చు నాకళ్యాణిఁ జూచి.....260
వనజాక్షి నిను నాఁడు వనవహ్నిఁ గూల
ననుమతించిన నాకు నవఘళం బెద్ది
నాక తంబున నిట్టి నలఁకువ వచ్చె
నాకతంబున నిట్టి నగుఁ బాటు వుటై
సొరిదిఁ బెం పెసఁగురాజుల దేవు లెల్లఁ
బరువడిఁ గనుసన్నఁ బనులు గావింప
నురు వైభవంబుల నుండుని న్నిట్టి
వరవుగ నమ్ముకో వలసె నే మందు
నీయట్టికులసతి నీయట్టిసాధ్వి
నీయట్టి ప్రియురాలి నేఁటితో, బాప...........270
సమకట్టెనే పాపజాతి దైవంబు
కమలాక్షి నాపూర్వకర్మ మెట్టిదియ


తంపరమ్ = అబద్ధమునకం టే మించిన పాపము లేదు, వక్రంబు గాళ్ = ఏస గా, ఆ “వమళంబు = లక్ష్యుము, నలఁకువజ పీడ, నగుఁబాటు=అపహాసము, కనుసన్నక్ ప నులు గావింపక్ = నీయొక్క కను సైగలచేత నే తెలిసికొని నీకువలయు ఊడిగములు చేయఁగా, ఉరువై భవంబునన్ = గొప్పయైశ్వర్యముతో, వరవు= దాసీత్వము,