ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

171


జనుఁ బత్నినైనను జట్టిగా నమ్మి
తనకు వచ్చిన బారిఁ దప్పింప వలయు' 240
నని చెప్పి 'నీతి వాక్యస్థితిఁ గొంత
మనమునఁ దలపోయుమా చలమేల
సతి నమ్మియైనదోషముఁ బాసి పుణ్య
గతి కేఁగుసద్విధి గలిగినఁ జాలుఁ
బంక జహితవంశ పాఱున కిచ్చి
బొంకినసా పంబు పొలియ దేమిటను
బొంకిన మొగసిరి తెలియు నాయుష్య
మింకుఁ దేఁకువ దప్పు నెడ తెగుఁ గీర్తి
నమ్మిక మాలు మానము దూలపోవు
వ మగుఁ బుణ్యంబు వచ్చు నాపదలు.........250
ధర నానృతార్దుష్కృతం పర మనుచు
నురువడి మోయుచు నుండు వేదములు

త్ని నైనను ... వలయును - తన కే బాధకలి గె నేని తపభార్య నైనను వెలకు నమ్మి దానిని తప్పించుకొనవలయును. జట్టి= వెల, సతి, . , జూలు - భార్యను విక్రయించి యైనను తనకుఁగ లుగుదోషమును దొలఁగించుకొను పుణ్యగతికిఁబోయెడు మంచి విధి ఆచరించినఁ జాలును-భార్య నై నను అమ్మవచ్చునుగాని సద్గతిగూర్చు ధర్మని ధిని దప్పరాదనుట. పొఱ... పాపంబు - - బ్రాహ్మణునకి చ్చెదనని చెప్పి వెనుక లే దని కల్లలాడుటవలనఁ గలుగుపాపము. పోలియదు ఏమిటను = ఏద్దాని చేతఁ గాని నశింపదు, మొగసిరి = పురుషత్వ పుసొంపు, తేఁకువ= బెట్టు, ఎడ తెగు= విచ్ఛిన్న మగును - నడుమ నశించిపోవును. నమ్మిక మాలు= తనయందు ఇతరులకుఁ గలనమ్మ కము చెడిపోవును, తూలపోవు= చెడును, ఎము = వ్యర్థము, నానృతాత్ దుష్కృ.