ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

167

పట్టి గుత్తని నిన్నుఁ బలు వీక్షింపఁ
జట్టు మోయించెదసర్వదా చూడు'..............................170
మనుచు నక్షుత్రకుం డంతరంగమును
మునుకొని చిల్లులు మోన నాడుటయు
జననాథుఁ డాత్మలోఁ జాలఁ జింతించి
తనయుండు నాలును దానును దక్క
నితరధనంబు లొండేమియుఁ గలుఁగు
మతము గానక చంద్రమతి దిక్కుఁ జూచి
గుడిగుడి కన్నీరు గ్రుక్కుచు నొండు
నుడువ నాలుక రాక నులివేఁడియూర్పు
లందంద నిగుడ మో మరవాంచి యున్న
చందంబుఁ జూచి యాసాధ్వీలలామ ................................180
దీపించుపతివక్త్ర దృష్టివి చేష్ట
లేపార నింగితం బెఱిఁగెడియట్టి
చదురాలు గాన సంశయ లేశ మైన
మది లేక పల్కె దీమసము పెంపునను
‘భూచ మెల్ల నేర్పున నేలినట్టి
రాచ వేల్పవు నీవు ప్రాకృతు నట్లు
పాయనిచింత విభ్రాంతిఁ గుం దెదవు

................................................................................................

వు- కార్యము తీర్చవనుట. గుత్త:-గుత్తయని, చట్టు=బండజాతిని, చిల్లులువో వన్ =తూటులుపడునట్లు, నులి వేఁడి జనులి వెచ్చ, వక్త = మొగము, దృష్టి =చూ పు, చేష్టలు= వ్యాపారములు, ఇంగితము= మనస్సునందలి యభిప్రాయము, చదురాలు = నేర్పుకత్తె, దీమసము= ధైర్యము, రాచవేల్పవు = రాజురూప మైన దేవ తవు, ప్రాకృతునట్లు=పామరునివ లె, దాయంబుకల= విపత్తు సమయమున, ఒండొ