ఈ పుట అచ్చుదిద్దబడ్డది
162

హరిశ్చంద్రోపాఖ్యానము


ప్రవిమలముకాతపత్రసుందరము
నరుణవి తానరమ్యమును సమీర
తరళిత వృషభ కేతనభాసురంబు
మణిరంగవల్లి కామంటపోజ్జ్వలము
ప్రణుత గుగ్గులు పపటలవాసితము.........................100
పటహ భేరీ శంఖ పణవ మృదంగ
పటు ఘంటికానేక బహువాద్యరవము
కాంతాసమర్పిత కర్పూరళకల
కాంత నీరాజన కాంతి శోభితము

..............................................................................................................

నాలుగు హజారముల చేతను, బంధురము = మనోజ్ఞ మైనది. ప్రవిమల • • • సుందర ము- ప్రవిమల = మిక్కిలి తెల్లనైన, ముక్తా ఆతపత్ర = ముత్యపు గొడుగు చేత, సుందరము= అందమైనది, అరుణ వితానరమ్యము = ఎఱ్ఱని మేలుకట్ల చే సొగ నై నది, సమీర... భాసురంబు---సమీర - గాలి చేత, తరళిత కదల్పఁబడిన, వృషభ కేతన - ఎద్దుపడఁగ చేత, భాసురము=మనోజ్ఞ మైనది. మణి . . . జ్వలము – మణి రత్నముల చేత నైష, రంగపల్లి కా = ముగ్గులతోఁగూడిన, మంటప = మంటపముల చే, ఉజ్జ్వలము - ప్రకాశించుచున్నది. ప్రణుత ... వాసితము • ప్ర ణుత = మిక్కిలినుతింపఁబడిన, గుగ్గులు ధూపపటల = గుగ్గిలపు ధూపములసమూ హము చే, వాసితము= వాసనగలదిగా చేయఁబడినది. పటహ...రవము హజాత ప్పెట, భేరీజన గారాలు, శంఖ= చిందములు, పణవ= చిన్నత ప్పెటలు, మృదంగ =మద్దెలలు, పటుమంటికా గొప్పగంటలు, అనేక పెక్కు లైన, బహు= నానావిధము లైన, వాద్య = వాద్యముల యొక్క, రవము= ధ్వని, గలది. .శోభితము - కాంతా = స్త్రీల చేత, సమర్పిత = అర్పింపఁ బడిన, కర్పూరశకల = కప్పురపు తునుకల చేత, కాంత = మనోజ్ఞ మైన , నీరాజన = ని వ్వొతులయొక్క, కొంత = ప్రకాశము చేత, శోభితము= ఒప్పునది. అగణిత ...