ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

హైందవ స్వరాజ్యము.

(14) ఇతరులవలెనే, ప్రజలమేలు నాలోచించుటకు మనము కారాగారప్రాప్తినుండి తప్పించుకొనవలె ననుట అంధాభిప్రాయ మని యెరుంగునో

(15) ఇతరులవలెనే, మాటకంటె పాటు మే లనియు, మనము నమ్మునది నేరుగా చెప్పి ఫల మనుభవించుట యుత్తమ మనియు, మనమాటల కప్పుడుగాని అర్ధ ముండదనియు నెరుంగునో

(16) ఇతరులవలెనే, మనము కష్టపడిననే స్వతంత్రుల మగుదు మనునది విశ్వసించునో

(17) ఇతరులవలెనే, పాశ్చాత్యనాగరకమును ప్రోత్సహించినందులకు అండమానుదీవులలో ఆజన్మప్రవాస మున్నను తగినప్రాయశ్చిత్తము కా దని తెలిసికొనునో

(18) ఇతరులవలెనే, ఏదేశజాతియు కష్టపడక అభివృద్ధి కాలే దనియు పశుబలయుద్ధముననే, నిజమైనశౌర్యము, ఇతరుని చంపుటకాక తాకష్టముల భరించుట యైనప్పుడు, సాత్త్వికనిరోధమున స్వార్థత్యాగమే ముఖ్యాంగ మనియు గురుతించునో

(19) ఇతరులవలెనే, ఇంకొకరు చేసిన మనము చేయుదు మనుట వ్యర్థులమాట యనియు, మనము న్యాయ మని నమ్మునది చేసినచో మార్గముం గని. ఇతరులు తప్పక చేయుదు రని