ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపసంహారము.

133

కారముచే నేలుచున్నా రా యనుప్రశ్నను విమర్శించుట యవసరము కాదు. మీరు మాదేశములో నుండుటకు నా కభ్యంతరము లేదు. పరిపాలకులు మీ రైనను ప్రజల సేవకులుగా మీ రిట నుండవలసి యుందురు. మీరు కోరునట్లుగా చేయవలసినవారము మేము గాము. మేము కోరినట్లుగా చేయవలసిన వారు మీరు. మీరు ఇటనుండి ఇదివరలో తీసికొనిపోయిన ద్రవ్యము నుంచుకొనుడి గాని ఇకముందు తీసికొనిపోకుడు. మా కిష్టమేని భారతభూమిసంరక్షణ మీ రుంచుకొనుడు. మానుండి వ్యాపారలాభము గడించు నభిప్రాయము మాత్రము మీరు మానవలసినది. మీరు ప్రోత్సహించు నాగరకము నిజముగా నాగరకవ్యతిరేక మని మావిశ్వాసము. మీ నాగరకమునకంటె మా నాగరకము వేయిరెట్లు మిన్న యని మా నమ్మకము. మీ రీ నిజ మెరుంగుదు రేని మీ కే లాభము. మో రెరుంగ రేని ఈ లోకోక్తులలో నొక్కదాని ననుసరించి మాభూమిలో మే మెట్లు నివసింతుమో అదేరీతిని మీరును నినసింపవలసి యుందురు. మామతములకు వ్యతి రేకముగా మీ రేమియుం జేయరాదు. పరిపాలకు లైనందున హిందువులయెడ మీధర్మము నెరవేర్చుటకుగా మీరలు ఎద్దు మాంసము మానవలెను. మహమ్మదీయులయెడ అదేధర్మమును నూనుటకు సూకరమాంసమును వీడవలెను. భీతచిత్తులమై యుండినందున మే మింతకాల మీమాట యెత్తలేదు.