ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యంత్రసామగ్రి

129

చదువరి: మీరు చెప్పుచుండున దంతయు యంత్రమూలకముగా అ చ్చగునుకదా? ఇది మంచిదా చెడుపా ?

సంపా: విషమును జంపుటకు విష ముపయోగించుట కలదు. ఇది అట్టిది. దీనివలన యంత్రములపక్షమున కేమియు సహాయము కాదు. యంత్రము మము వీడిపోవుచు ఇట్లనును. “ననుగురించి జాగ్రత్తపడుడు. నన్ను వీడి దూరముపొండు. నావలన మీకు లాభములేదు. అచ్చువలన కలుగులాభము యంత్రములపిచ్చి పట్టినవారికే మాత్ర మనుట నెరుంగుడు. " కాబట్టి, ముఖ్యవిషయమును మరువకుడు. యంత్రసంస్థలు కీడు. ఇది జ్ఞాపకమున్న యంత్రములను మనము దప్పించు కొనవచ్చును. మనయుద్దేశము సద్యఃఫలముగా నెరవేరుటకు దైవము మార్గము లేర్పరచియుండలేదు. యంత్రసామగ్రి వరదాన మని యంగీకరించుట మాని చెఱుపనుట గురితింతు మేని అది క్రమముగా నశింపగలదు.


__________