ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్య

123

చదువరి: అయినను దానిం దక్క మన మేమియు చేయ జాలము. భారతభూమి ఏనాడును దైవమును త్యజించునది కాదు. నాస్తిక మిచ్చట పెచ్చు పెరుగజాలదు. కార్యము కష్టతమము. మతవిద్యనుగూర్చి యాలోచించినచో తల తిరుగుచున్నది. మన మతాచార్యులు దంభోపేతులు, స్వార్థపరులు, వారిని మనము వినియోగింపవలసియుండును. ముల్లాలు, దస్తూరులు, బ్రాహ్మణులు మతవిద్యకు ధర్మకర్తలైయున్నారు. వారు జాగ్రత్తపడి ధర్మమునెరవేర్చ రేని ఇంగ్లీషువిద్యచే మనకు గలిగినశ క్తిని తత్కార్యసాధనకు నియోగింతుము. మత మను మహాసముద్రగర్భము గంభీరముగ నే యున్నది. భూస్పర్శగల యలలుమాత్రము కలుషితములై యున్నవి. ఈయలలు మనము. కోటానుకోట్లు ప్రజ అకలుషితులు. మనము హైందవత్వము నందవలెను. పాశ్చాత్యనాగరకమును తరుమవలెను. మన పరిణామమున అభివేద్ధి, లోపములు, దోషములు, అపాయములు కలుగనచ్చును. కాని ముక్తిమాత్రము కరతలామలకము.