ఈ పుట ఆమోదించబడ్డది
8

హైందవ స్వరాజ్యము


యగుబూటక మనుకొనుట దురభ్యాసము. అభిప్రాయ భేదమా త్రమున ఎదుటివారు దేశద్రోహులనుటయు నిట్టిదియే.


చదువరి: తమయర్థము నాకిప్పుడొక కొంచెము స్ఫురించు చున్నది. నేను ఇంకను ఆలోచించుకొనవలసియున్నది. కాని మీరు హ్యూమును గురించియు సర్ విల్లియము వెడ్డర బరనును గురించియు చేయుసంభాషణ నా కేమియు గోచరింప లేదు.


సంపా: హిందువుల విషయములో ఏ తత్త్వము పనికివచ్చి నదో ఇంగ్లీషువారి విషయములో కూడ ఆతత్త్వమే పనికి వచ్చును. ఇంగ్లీషువారందరు చెడ్డ వారని నే నెప్పుడు చెప్ప నొప్పుకొనను. వారిలో అనేకులు భారతభూమికి స్వరాజ్యము కోరువారున్నారు. ఇతరులకంటే ఇంగ్లీషు వారికి కొంచెమెక్కువ స్వార్థపరత్వ మున్నదనుట నిజమే కాని ఆమాత్రము చేత ఇంగ్లీ షువారందరు చెడ్డ వారు కారు. న్యాయము మనకు చేయమని ఇతరులను కోరునప్పుడు మనమును ఇతరులకు న్యాయము చేయవలెను. సర్ విల్లియము భారతభూమికి చెడుగుకోరడు. అదియే మనకు చాలును. మనము న్యాయముగా నడుచుకొను నెడల మనకు స్వాతంత్య్రము శీఘ్రతరముగా కలుగును. అది మీకు ముందు తెలియగలదు. ప్రతి ఇంగ్లీషువానిని మన శత్రు వుగా దూరము చేయు నెడల స్వరాజ్యము దూరము పోవును. అదియు మీకు ముందు తెలియగలదు. కాని మనము వారి