ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

111

విభేదము నిందు లేదు. ఇందులకు సైనికశిక్షణ మక్కరలేదు. జియుజిట్సు అక్కర లేదు. మనమును నిగ్రహించుశక్తిమాత్ర మవసరము. అది కలిగెనేని మానవుడు పురుషసింహ మగును. అతని చూపుమాత్రన శత్రువు భయకంపితుడు కావలసి యుండును.

సాత్త్వికనిరోధము అనేకధారాయుత ఖడ్గము. ఎట్లు కావలసిన నట్లు దానిని త్రిప్పనగును. ఎవ్వ డుపయోగించునో వానిని, ఎవ్వనిపై ఉపయోగింపబడునో వానిని, ఇరువురనుగూడ నీఖడ్గము పవిత్రముచేయును. ఒక్క బిందువు రుధిరము చిందింపక యియాయుధము మహత్తమఫలములను సంపాదించును. సాత్త్వికనిరోధులలో పోటీ వైచికొనినను పరాజయ మందువా రుండరు. సాత్త్వికనిరోధఖడ్గమునకు వరయు నక్కర లేదు. ఇట్టి మహాయుధమును బలహీనులయాయుధ మని మీరు వర్ణించుట చిత్రముగానేయున్నది.

చదువరి: సాత్త్వికనిరోధము భారతభూమికి ప్రత్యేక సాధన మంటిరి. ఈ దేశమున ఫిరంగు లెప్పుడును ఉపయోగించ లేదా?

సంపా: మీయభిప్రాయమున భారతభూమియనిన నిచ్చటి కొన్ని రాజనంశములనుటగా నున్నది. ఏకోటానుకోటి ప్రజ పై ఆరాజవంశములును మనమును ఆధారపడియున్నామో ఆకోటానుకోటి ప్రజయే నామానసమున భారతభూమి.