ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

107

నేని వానికర్తలను బలాత్కారముగా నైననుసరే తరిమి వేయవలెను.

సంపా: నేను అతివాదుల మించెదనో లేదో దానితో మన కవసరము లేదు. ఏది రుజుపథమో కనిపెట్టుట మన ధర్మము. తదనుగుణముగా నడుచుకొనుట మనకు కర్తవ్యము. మనము న్యాయబద్ధుల మనుట కర్ణము మనము సాత్త్విక నిరోధుల మనియే. ఏదేనిశాసనము మన కరిష్టమగుచో శాసనకర్తల నెత్తులు బ్రద్దలుకొట్టువారము కాము. మనము దానిని తిరస్కరించి అందువలన కలుగుకష్టముల ననుభవింతుము. శాసనము శిష్ట మైనను దుష్ట మైనను లోబడవలయు ననుట క్రొత్తసిద్ధాంతము. పూర్వ మిట్టిఆలోచనయే యుండలేదు. ఏశాసనములు తమ కసమ్మతములో వానిని తిరస్కరించి ప్రజలు తత్ఫలము ననుభవింతురు. మనస్సాక్షికి విరోధ మగుశాసనములకు లోబడుట పౌరుషవ్యతిరేకము. మతమునకు విరోధము. దాస్యమునకు బునాది. ప్రభుత్వమువారు నన్ను లై తిరుగవలసిన దందు రనుకొందము. మన మట్లు కావింపవలసినదేనా. నేను సాత్త్వికవిరోధినేని వెంటనే అయ్యలారా, మీ యీశాసనము నా కన్వయింపజాల దని వారికి తెలియ పరతును. మనము మనయాత్మలకు మరచిపోయినాము. అడుగుల కెరగుట మన కభ్యాసమై పోయినది. కావున ఎంతటి నీచ శాసనము నైనను శిరసావహించుట కేవగింపకున్నారము.