ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

హైందవ స్వరాజ్యము

చెప్పినయుపాయము నిజముగా పనికిరాదు. శిశువును మీ రేమిచేయుచున్నారో ఆలచింపుడు. మిమ్మును కాదని తన పశుబలముచే శిశువు అగ్ని నురకగలదేని మీ యుపాయ మాపదను వారింపదు. అప్పుడు మీకు రెం డుపాయములు నిలువయుండును. అది యగ్ని నురుకకుండుటకు మీరు దానిని చంపనైన చంపవలెను లేదా చూచుట కోర్వలేక మీ రైనను చావవలెను. దానిని మీరుచంపరు. మీహృదయము అంత కరుణార్ద్రము కాదేని శిశువునకు ముందుగా మీ రగ్ని నురికి నశింపరు. మీ రేమిచేయుదురు ? చేతగామి శిశువు నగ్ని నురుకనిత్తురు. ఇట్లు మీరు పశుబలము నుపయోగించుట మానివైతురు. మీచేతనైనచో శిశువును అగ్ని నురక కుండ నిర్బంధింతు రే అదియు పశుబలమే. అయిన క్రింది దర్జాకు చేరినది, అని మీరందురేమో, అదికాదు దాని స్వభానము వేరు. మన మింకను నరయవలసియున్నాము,

ఆరీతిని మీరు శిశువును నిర్బంధించుటలో మీరు దాని లాభమునుమాత్ర మాలోచించుచున్నారు. దాని మేలునకై మాత్రమే మీరు అధికారము చేయుచున్నారు. ఇది మరువ రాదు. మీ నిదర్శనము ఇంగ్లీషువారికి సమన్వయము కాజాలదు. ఇంగ్లీషువారిపై పశుబలప్రయోగము చేయునప్పుడు మీ రాలోచించునది మీ మేలుమాత్రమే, మీజాతియొక్క లాభముమాత్రమే. ఇందులో దయకుగాని ప్రేమకుగాని