ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశుబలము

99

దను సూచించును. దాసుడు పెట్టుకొనుఅర్జీ వానిదాస్యమును ప్రకటించును. బల మాధారముగాగల అర్జీ సమానునిది. అతడు అర్జీమూలకముగా స్వాతంత్ర్యముకోరుట అతని హృదయగౌరవమునకు నిదర్శనము. అర్జీల కాధారము రెండు విధము లగుబలము కావచ్చును. "ఇది ఈయవేని మేము మీకు చెరుపు చేయుదుము ” అనుట యొకరీతి. పశుబలము దీని కాధారము. దీని దుష్టఫలము లిదివర కే వర్ణితములు. రెండవవిధ మిట్లు పేర్కొననగును. "మాయుద్దేశముల నెరవేర్చ లేని ఇక మీ కర్జీలు మేము పెట్టము. మేము పరిపాలితులముగా నున్నంతకాలము మీరు మమ్ము పరిపాలించగలరు. ఇకముందు మేము మీతో సంబంధము పెట్టుకొనము ” ఇందు కాధార మగుబలము ప్రేమబల మనవచ్చును. ఆత్మబల మనవచ్చును. లేదా సామాన్యముగా వ్యవహరింపబడురీతిని సాత్త్వికనిరోధ మనవచ్చును. ఇది అంత సరియైనపదము కాదు. ఈబలముమాత్రము నశ్వరము. దీనిని పూర్ణముగా ప్రయోగింపగలవాడు తనస్థితి కెప్పుడును వగవడు. ప్రాతలోకోక్తి యొక్కటికలదు. దానియర్థ మిది. ఒక్క-నహి ముప్పది మూడు రోగముల కుదుర్చును. ఈప్రేమ బలమునకు అథవా ఆత్మబలమునకు ఎదురుపడినప్పుడు పశుబలము వ్యర్థము. కడపటనిచ్చిన యుదాహరణమును విమర్శింతము. అదెద్ది ? శిశువు అగ్నిలో కాలిడుట మాన్పు టెట్లు అనునది. మీరు