ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పును. ఆత్మ చెప్పునప్పుడు జీవాత్మ వినగలుగును. ఆత్మ చెప్పునప్పుడు మొదట జీవాత్మ ఆ విషయమును తెలియగలుగుట వలన అప్పుడు ఆత్మ, జీవాత్మ వేరుగా ఉన్నాయని చెప్పవచ్చును. ఈ విధముగా దైవాంశగల శరీరములో జీవాత్మ, ఆత్మ రెండూ నిరూపణకు వచ్చినవి. కానీ ఇంతవరకు నిరూపణకు రానిది ఒక పరమాత్మ మాత్రమే. ఏ నిరూపణలేనప్పుడు హేతు బద్దముగా, శాస్త్రబద్దముగా పరమాత్మ ఒకటున్నదని నిరూపించాలేము. కావున అటువంటి ఇబ్బంది లేకుండా పరమాత్మ కూడా నిరూపణకు వచ్చిన సందర్భములు కొన్ని కలవు. ఆత్మ శరీరములోపల మాత్రము వ్యాపించి ఉండగా, పరమాత్మ ప్రపంచమంతా శరీరములోపల, శరీరము బయటా వ్యాపించియున్నది. ఆత్మ శరీరము అంతటా అధికారము కల్గియుండగా, పరమాత్మ చరాచర ప్రపంచమంతా అధికారము కల్గియున్నది. అందువలన దైవముగల శరీరము బయటికి సాధారణముగా కనిపించినా ఆ శరీరము నుండి వచ్చు ఆజ్ఞ చరాచర ప్రపంచమంతా అమలు కాగలదు. ఆగిపో అంటే వీచే గాలి ఆగిపోగలదు. కదిలే సముద్రము ఆగిపోగలదు. మండే అగ్ని ఆరిపోగలదు. గతములో దైవాంశగల జన్మలు రావడము, ఎంతో జ్ఞానము బోధించడము జరగడమేకాక, నోటిమాటతో ప్రకృతిని శాసించిన సంఘటనలు జరిగినవి. అందువలన శరీరములో జీవాత్మ, ఆత్మయేకాక, పరమాత్మ కూడా నిరూపణకు వచ్చినదని తెలిసిపోయినది. దైవాంశ ఎప్పుడో ఒకప్పుడు భూమిమీదకు వచ్చి దాని జ్ఞానమును అదియే చెప్పుననీ, అట్లు రాలేదని వాదించు వారికి జవాబుగా దైవాంశ తన ఉనికిని జ్ఞానులు మాత్రము తెలియుటకు తగినట్లు ఏదో ఒక ఆధారముండునట్లు చేసివుండుననీ, అటువంటి ఆధారముతోనే శ్రీకృష్ణున్ని భీష్ముడు గ్రహించగలిగాడనీ తెలుపుచూ ఇంతటితో నేను (ఆత్మను) ముగిస్తున్నాను.

-***-

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/48&oldid=279642" నుండి వెలికితీశారు